“వేల కొద్ది నీతులు బోధించే కన్నా, ఒక్క మంచి పని ఆచరించి చూపు” అని స్వామి వివేకానంద చెప్పినట్లు, మనము ఎన్నో మంచి పనులు చెయ్యాలనుకుంటాము, కాని అలా అనుకునే అందరి దగ్గర అందుకు తగ్గ సమయం కాని, డబ్బు కాని ఉండకపోవచ్చు.
అన్ని దానములలో కెల్లా విద్యా దానం చాలా గొప్పది. ఒక వ్యక్తికి తన కాళ్ల మీద తను నిలబడే ఆత్మ స్థైర్యాన్ని ఇచ్చే గొప్ప శక్తి “విద్య” కి మాత్రమే ఉంది. చదువుకోవడం అంటే చాల మంది కి ఎంతో ఇష్టం, కాని కొన్ని కారణాల వల్ల, మన సమాజం లో అర్హత ఉన్నా ఆర్ధిక పరిస్థితి అనుకూలించక ఎంతో మంది చదువుకు దూరమవుతున్నారు.
కళాకారుడు: శ్రీ కొలగాని వరా ప్రసాద్
అలాంటి చదువు పట్ల నిజయితీగ ఉండే అర్హులైన విద్యార్ధుల చదువుకు ఆర్ధికంగా తోడ్పాటును అందించాలని MMF సంకల్పించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మీరు ఆర్ధిక స్థోమత లేని ఏ విద్యార్ధి నైన చదివించవచ్చు.
* మీరు ఇండియాలోని ఏ విద్యార్ధినైన ఎన్నుకుని వారి చదువుకి మీ పూర్తి ఆర్ధిక సాయాన్ని అందించవచ్చు. ఇందుకు మీకు పూర్తి పన్ను మినహాయింపు వస్తుంది.
* చదువుకు సాయం చెయ్యాలని ఆలోచన మీలో ఉన్నా, ఒక విద్యార్ధి యొక్క పూర్తి ఖర్చు మీరు భరించలేమనుకుంటే ….మీరు ప్రతి నెల చిన్న మొత్తాన్ని(కనీసం $30 నుంచి మొదలు) MMF కి జమ చెస్తే, మీలాంటి సహృదయమున్న మరింత మంది ఇచ్చే చిన్న మొత్తాల్ని ప్రోగు చేసి, మేము గుర్తించిన అన్ని అర్హతులు ఉన్న విద్యార్ధిని చదివించడానికి ఉపయోగిస్థాము. దీని అర్ధం పది మంది మంచి మనసున్న మనుషులు కలిసి ఒక విద్యార్ధిని చదివించడం.
“కదలకుండ కూర్చుంటే “కల” కూడ చెదిరిపోతుంది. ఆచరణకి పూనుకుంటేనే కదా స్వప్నమైనా సాకారమవగలిగేది”. మనలోని కదలిక, కనీసం మన సమాజంలో చదువుకోవాలనుకునే ఒక్కరి కలని సాకారం చేసిన అది మరో పది మందికి స్ఫూర్తి నిస్తుంది. మనం చేసే చిన్న సాయం కూడ అవసరంలో ఉన్నవారికి చాల పెద్ద సాయం కాగలదు. అందుకే “నేను సైతం” అని మీరు మనస్పూర్తిగా ఇచ్చే ప్రతి రూపాయి మాకు మరింత మంది విద్యార్ధుల ఆశల్ని నెరవెర్చగలిగే శక్తి నిస్తుంది.
ఎంతోకొంత సమాజానికి సాయం చెయ్యాలనకునే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలనే మంచి ఉద్దేశంతో నిర్వహించబడే కార్యక్రమమే…….ఈ నేను సైతం.