రైతుకు ప్రేమతో

ఆరుగాలం కష్టించి, ఎండనక వాననక, పురుగనక పుట్రనక, పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదో తెలియకుండా, ప్రతి యేడూ గుండె దిటవుచేసుకుని దేశానికి, మానవాళికి పట్టెడన్నం పెడుతున్న నవభారత రైతుల దుస్థితి చూస్తుంటే నిజంగానే గుండె తరుక్కుపోతున్నది!పుట్టి పెరిగిన కర్మ భూమినే కన్నబిడ్డగా భావించి ప్రళయ ప్రకృతి, అనైతిక వ్యాపారనీతి లాంటి అనేకానేక విషమయ పరిస్థితులనుతట్టుకుంటూ అహరహం పరితపిస్తూ తద్వారా సకల మానవాళి మనుగడకి ప్రత్యక్షంగా, పరోక్షంగా పాటుపడుతున్న అన్నదాతలకి పాదాబి వందనం!!!

తడవని నేలని చూసొ, లేక మొలకెత్తని విత్తనాల్ని చూసొ, లేక మరే ఇతర కారణం చేతనో కాని మన  రైతు  సంవత్సర కాలం పడుతున్న కష్టం మాత్రం ఫలించడం లేదు. తప్పు ఎవరిదొ తెలుసుకుని వాళ్ళని నిందించే పని చెయ్యడం చాల సులబం. కాని ఆ కష్టంలో ఉన్న రైతుకి ఎంతో కొంత సాయం చెయ్యలనే మంచి మనసుతో…” మా అందరికి ప్రతిరోజు అన్నం పెట్టే నీకు కష్టం వస్తే, నీ కష్టంలో పాలు పంచుకుని, నీకు తోడుగ మేము ఉంటాము” అని చెప్పడానికి మాత్రం చాల “ధైర్యం” కావాలి………అంతకు మించి “గొప్ప మనసు” కూడ కావాలి.

మా ఆలోచనని కొందరు ఆత్మీయులతో పంచుకున్నప్పుడు, వారికి కూడ రైతుపడె కష్టానికి స్పందించే సున్నితమైన మనస్సు ఉందని తెలిసి ఎంతో సంతోషించాము. మా ఆలోచనల్ని కార్యరూపంలో పెట్టి, ఒక సమగ్రమైన రైతు సహయక ప్రణాలికని మన పరిధిలో అమలు చెయ్యాలంటే అందుకు మీ అందరి సహాయం ఎంతో అవసరం.

ఏఒక్క రైతుకి, ఒక్కసారి తన పొలానికి విద్యుత్ సదుపాయం కల్పిస్తేనో, లేక తన పొలంలో బోరు బావిని తవ్విస్తేనో…… మన లక్ష్యం నెరవేరదు. ఇలాంటి నిజమైన అవసరమున్న రైతులని  గుర్తించి, వారికి ఒక క్రమ పద్దతిలో తగు సదుపాయాల్ని కల్పిస్తూ… మీకు మేము అండగ ఉంటాము అనే బరోసా కల్పించాలనే సదుద్ధేశంతో మొదలు పెట్టిన పధకమే ఈ “రైతుకు ప్రేమతో” పధకం.

 

ఈపధకంలో జమ అయ్యే ప్రతి రుపాయి కుడా, ఒక నిధిగ ఏర్పాటు చేసి, దాని నుంచి వచ్చే వడ్డీ ఆదాయంతో ప్రతి నెల ఒక్కో రైతుకి నిరంతరాయముగ మేలు చెయ్యడమే ఈ పధకం యెక్క లక్ష్యం.

దీని అర్దం, ఒక్కసారి ఈ నిధిలొ జమ చెయ్యడం వలన, కేవలం ఒక్కసారి ఒక్క రైతుకి మాత్రమే మనం చేసే సాయంలో భాగం పంచుకోవడమే కాకుండ… ప్రతీ నెల MMF చేసే రైతు సహాయక కార్యక్రమాలలో (కరెంట్ కన్నెక్షన్ ఇప్పించడం, నీటి పంపు వెయ్యించడం లేక విత్తనాలు కొనిపెట్టడమొ లాంటి పనులు…) మీరు పాలుపంచుకునే అవకాశం దక్కుతుంది.

ప్రతీనెల మనందరం కలిసి ఒక్కోరైతుని ఆదుకునే శక్తిని కలిగి ఉండటం అంటే!!….సాక్షాత్తు అన్నం పెట్టే రైతుకే అండగా ఉండటమంటె!!…… నిజంగ మనకన్నా అద్రుష్టవంతులు ఇంకెవ్వరుంటారు?

రైతుల కష్టాలు, వారి ఆత్మ హత్యలు చూసి కేవలం మనసులో బాధ పడడం అందుకు కారణం అయిన వారిని నిందించడం వల్ల ఎవరికీ మేలు జరుగదు. ప్రతీ “విజయం” ఒక్క మెట్టుతోనే మొదలవుతుంది… ఆ మెట్టు మీద “తొలి అడుగు” మనమే వేద్దాము, మన ధైర్యాన్ని చూసి, రైతు కష్టం చిన్నబోయేల చేద్దాం.

మీ మంచి మనసుని అర్దం చేసుకుని రైతుకి సాయం చెయ్యగల నిజాయితీ మాలో ఉంది. సంశయం మాని మమ్మల్ని నమ్మి మాతో చెయ్యి కల్పండి. మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమంతో రైతు కుటుంబాలలో ఆనందం వెల్లి విరియడానికి మంచి మనసుతో ముందుకు రండి. మా వంతుగ మీ ప్రతి రుపాయిని ఎంతో సమర్ధవంతంగా ఉపయోగిస్తూ, పూర్తి పారదర్శకతతో మెలుగుతాము అని తెలియ చేస్తున్నాము.

మీ ప్రతి సందేహాన్ని తీర్చటం మా బాద్యత, దయచేసి మమ్మల్ని సంప్రదించగలరు.