మీలోని అధ్భుతమైన వ్యక్తి

"రోజుకు ఒక్కసారి అయినా మీతో మీరు మాట్లడుకోండి, లేకపోతే ఓక అధ్బుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతారు"

– శ్రీ స్వామి వివేకానంద.

కళాకారిణి:  కుమారి దండు హారిక మనోజ్ఞ 

మనం రోజూ మన కుటుంబ సభ్యులతోనో, స్నేహితులతోనో, లేక తోటి సహోద్యోగులతోనో గంటలతరబడి మాట్లాడుతుంటాము. ఇది సమాజంలో మన మనుగడకి ఎంతో అవసరం. కాని మనల్ని మనం సరిగ్గ అవగాహాన చేసుకోవాలన్న, సమాజం లో మన మనుగడని మరింత అర్ధవంతం చేసుకోవలన్నా, అసలు మనమేంటో మనకి తెలుసుకోవాలనిపించిన, అందుకు ప్రతి ఒక్కరు ఆచరించ గలిగే సులువైన మార్గం ఒకటి ఉంది. ఆదేమిటంటే, ప్రతి రాత్రి నిద్రకి ఉపక్రమించే ముందు ఒక్క పది నిముషాలు కళ్ళు మూసుకుని మీతో మీరు మాటలాడుకుని చూడండి. ప్రతి రోజు మీకే తెలియని “మీరు” సరికొత్తగ పరిచయమవుతూ ఉంటారు. మీలోని లోపాలు ఏంటో మీకు తెలుస్తాయి, మీ సామర్ధ్యంపై మీకొక స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. మరుసటి రోజు మీ ప్రవర్తనలో మీరు గుర్తించే మార్పుని మీ కళ్ళతో మీరే చూస్తారు. రోజులు గడిచే కొద్ది మీలో ఎదో తెలియని ఆనందం…. మిమ్మల్ని మీరే సరికొత్తగ అవిష్కరించుకున్న ఆనందం అంతేకాదు… ఏదో ఒక రోజు మీ “జీవిత పరమార్ధం” మీకు అర్ధమవుతుంది. ఇది అక్షర సత్యం!!!

మనలో ప్రతి ఒక్కరిలో కేవలం ఒక అధ్బుతమైన వ్యక్తేకాదు, మనం నమ్మలేని నిజం ఏంటంటే, మనలో ప్రతి ఒక్కరిలోను “దేవుడున్నాడు”. నమ్మశక్యంగ లేదా? ఐతే ఒక్కసారి కళ్ళు మూసుకుని మీరు రోజూ పూజించే, మీకు ఎంతో ఇష్టమైన దేవుడిని తలచుకోండి. నిజంగ ఆ దేవుడే మీ కళ్ళ ముందు ప్రత్యక్షమైనట్టు ఊహించుకోండి… అప్పుడు మీ కళ్ళళ్ళో ఆ దేవుడిని చూసిన ఆనందం ఎలా ఉంటుందో ఊహించండి?

ఊహించని ఆ భగవద్ సాక్షాత్కారానికి మీ కళ్ళు చెమర్చి ఉంటాయి అవునా? ఇప్పుడు అదే దేవుడిని మీలో చూసుకోవాలంటే… రేపు ఎలా గడుస్తుందా అని ప్రతి రోజు భయపడే ఒక మధ్యతరగతి కుటుంభంలోని విద్యార్ధి కోసం, మీ సంపాదన లో కేవలం 1% ఖర్చు చెయ్యడానికి సిద్ధపడి… ఆ విద్యార్ధి తల్లి దగ్గరకి వెళ్ళి…” అమ్మా మీరు బ్రతకడానికి పడే కష్టం నేను అర్ధం చేసుకున్నాను, మీ బిడ్డ బడి ఫీజు బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి చూడండి” ఆ మాట విన్న ఆ కన్న తల్లి చెమర్చిన కళ్ళళ్ళోకి ఒక్కసారి చూడండి… ఎంతో ఉన్నతమైన మీ రూపం ఆమె కళ్ళళ్ళొ మీకు కనిపిస్తుంది.

కళాకారిణి:  కుమారి దండు హారిక మనోజ్ఞ 

మీకు మీ కలలో దేవుడిని చూసినప్పటి అనుబూతి, ఆ తల్లికి మిమ్మల్ని చూసినప్పుడు కలిగిన అనుబూతి ముమ్మాటికి ఒక్కటె. ఇది నిజం!!! ఆ కష్టం ఒక బీద రైతు వ్యవసాయం చెయ్యలేని “నిర్వేదం” కావొచ్చు… ఓ మధ్యతరగతి విద్యార్ధి యొక్క ఫీజు కట్టుకోలేని “నిస్సహాయత” కావొచ్చు… సాటి మనిషి కష్టంలో ఉంటే మనం స్పందించక పోయినా “మనలోని మనిషి” స్పందించాడు అంటే… దాని అర్ధం మనలో ఇంకా మానవత్వం బ్రతికే ఉందని, ఆ మానవత్వాన్ని మన చేతల ద్వార వ్యక్తపరిచినప్పుడే మన జీవితం సార్ధకం అవుతుంది. మనలోని ప్రతి ఒక్కరిలోను నిద్రానంగ ఉండే దైవసమానమైన ఆ “మనిషి” ని మనకు మనం పరిచయం చేసుకుంటూ, ఎంతో సులభమైన మార్గంలో, మీరు ఇచ్చే ప్రతి రుపాయిని సధ్వినియోగపరుస్తూ, పూర్తి పారదర్శకతతో, జవాబుదారితో కూడిన సదావకాశాన్ని అందరికి అందించాలనే సహృదయంతో స్థాపించిన సంస్థే, “మనలోని మనిషి ఫౌండేషన్”.